రౌడీ హీరోకు స్పెషల్ థాంక్స్ చెప్తున్న స్టైలిష్ స్టార్.!

Published on Dec 3, 2020 8:00 am IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మన టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ అండ్ టాలెంటెడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా తన పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు ఈ రౌడీ విజయ్ కు స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నారు. ఇంతకీ ఏ విషయంలోనో చూద్దాం. విజయ్ దేవరకొండకు తన స్పెషల్ డ్రెస్సింగ్ బ్రాండ్ “రౌడీ” ఉన్న సంగతి తెలిసిందే.

ఆ బ్రాండ్ నుంచి విజయ్ బన్నీకు గతంలోనే ఒక కలెక్షన్ ను పంపాడు. అలా ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్ ను పంపాడు. దీనితో అవి వేసుకొని మరింత స్టైలిష్ లుక్ లో కనిపించి ఇలాంటి స్పెషల్ థింగ్స్ ను తనకు పంపినందుకు తన బ్రదర్ విజయ్ కు అలాగే తన రౌడీ బ్రాండ్ వారికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నానని బన్నీ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఏ మాటకి ఆ మాట కానీ ఈ రౌడీ హీరో పంపిన స్పెషల్ కలెక్షన్ లో బన్నీ మరింత సూపర్ స్టైలిష్ గా ఉన్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More