వైరల్ పిక్ : భార్య స్నేహారెడ్డి తో అల్లు అర్జున్ స్వీట్ పిక్

వైరల్ పిక్ : భార్య స్నేహారెడ్డి తో అల్లు అర్జున్ స్వీట్ పిక్

Published on Nov 19, 2022 9:56 PM IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప ది రూల్ మూవీలో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న పుష్ప ది రైజ్ మూవీ కి సీక్వెల్ గా రూపొందనున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఇక ఆ మూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా తనని తాను సిద్ధం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లో ఫామిలీ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు.

కాగా నేడు అక్కడి ఒక వెడ్డింగ్ కి ప్రత్యేకంగా విచ్చేసిన అల్లు అర్జున్, తన భార్య స్నేహా రెడ్డి తో కలిసి దిగిన స్వీట్ పిక్ ని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. అలానే దానికి హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఉనక్కుళ్ నాన్ సాంగ్ ని కూడా జత చేయడం జరిగింది. కాగా ఐకాన్ స్టార్ జోడీ అందంగా దిగిన ఈ ఫోటోని ఆయన ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు