ఆ సీక్వెల్ ఇక లేనట్టేనా.. బన్నీ మనసు మార్చుకున్నాడా..?

ఆ సీక్వెల్ ఇక లేనట్టేనా.. బన్నీ మనసు మార్చుకున్నాడా..?

Published on Dec 18, 2025 6:58 PM IST

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ క్రేజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ పాత్రకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తాడని మేకర్స్ చెబుతున్నారు.

అయితే, బన్నీ కెరీర్‌లో మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సరైనోడు’ చిత్ర సీక్వెల్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సీక్వెల్‌ను ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్ని్స్తోందట. కానీ, బోయపాటి ఫామ్ చూసి ఇప్పుడు ఈ ఆలోచన విరమించినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణతో కలిసి బోయపాటి ‘అఖండ – 2’ చిత్రాన్ని రూపొందించినా, అది అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేదు.

దీంతో బోయపాటి శ్రీనుతో సీక్వెల్ సినిమా చేయాలని భావించిన అల్లు అర్జున్ కూడా దీనిని విరమించినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ-బోయపాటి కాంబోలో సినిమా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించం లేదు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు