స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోన్న సంగతి ఇదివరకే తెలియజేశాం. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ఊటీలో జరగనుంది. అక్టోబర్ 25 నుంచి ఈ చిత్ర ఊటీ షెడ్యూల్ మొదలు కానుంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత చివరి షెడ్యూల్ హైదరబాద్ లో జరగనుంది.
అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో సమంత, ఆద శర్మ, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే సమంత, ఆద శర్మ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు, ప్రణిత త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మరియు స్నేహ కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఊటీ షెడ్యూల్ లో ఉపేంద్ర ఈ చిత్ర టీం తో జాయిన్ అవుతాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కె రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.


