కొనసాగుతున్న బన్నీ హవా..ఖాతాలో మరో రికార్డ్.!

Published on Jul 15, 2020 2:45 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మన తెలుగులోనే కాకుండా నార్త్ ఆడియన్స్ లో కూడా అపారమైన ఆదరణ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా తాను నటించిన సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తుంటాయి. ఇటీవలే తాను నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” పాటలు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపుతున్నాయి.

ఇలా మన టాలీవుడ్ నుంచి భారీ ఎత్తున యూట్యూబ్ ను శాసిస్తున్న బన్నీ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ ఎంటర్టైనర్ “సరైనోడు” చిత్రం యూట్యూబ్ లో 300 మిలియన్ మార్కును టచ్ చేసి మరో రికార్డు నెలకొల్పింది.

అంతే కాకుండా 1 మిలియన్ లైక్ లకు పైగా రాబట్టింది. ఇది వరకే యూట్యూబ్ నుంచి తొలగించిన సినిమాకు 250 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి ఈ సినిమా క్రేజ్ అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :

More