సౌత్ ఇండియన్ స్టార్స్ తో బన్ని మల్టీ స్టారర్ మూవీ.?

సౌత్ ఇండియన్ స్టార్స్ తో బన్ని మల్టీ స్టారర్ మూవీ.?

Published on Oct 14, 2015 10:40 PM IST

Allu-arjun
గత రెండేళ్ళ నుంచి తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తి చూపుతుండడంతో దర్శకులు కూడా అలాంటి కథలను రాయడానికి ఇష్టపడుతున్నారు. మన తెలుగుతో పాటు మిగిలిన సౌత్ ఇండస్ట్రీలు కూడా మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటె మల్టీ స్టారర్ సినిమాలను ప్రారమ్భీంచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వచ్చిన రుద్రమదేవితో స్టార్ హీరో అయినా మంచి రోల్ వస్తే చెయ్యాలనే మరో ట్రెండ్ ని స్టార్ట్ చేసాడు. రుద్రమదేవి ప్రమోషన్స్ టైంలో అల్లు అర్జున్ త్వరలోనే ఇక్కడి స్టార్ హీరోస్ ఇతర భాషల స్టార్ హీరోస్ తో ద్విభాషా చిత్రాలు చేసే సమయం త్వరలో వస్తుంది అని అన్నాడు.

అలా అని ఊరుకోకుండా, ఆ ట్రెండ్ కి కూడా తనే శ్రీకారం చుట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు. మాకు అందిన కొన్ని వర్గాల సమాచారం ప్రకారం క్రేజీ డైరెక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ నలుగురు కుర్రాళ్ళ చుట్టూ అల్లుకున్న ఓ కథని సిద్దం చేస్తున్నారు. కాలేజ్ డేస్ తర్వాత సెపరేట్ అయిన నలుగురు ఫ్రెండ్స్ ఒక పెళ్ళిలో కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే అక్కడ ఏం జరిగింది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఆ కథ కోసం సౌత్ ఇండియాలోని ఒక్కో భాష నుంచి ఒక్కో హీరోని ఎంచుకోవడానికి సిద్దమయ్యాడు. అలా తెలుగు నుంచి అల్లు అర్జున్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే తమిళం నుంచి శింబుని, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్ ని, మలయాళం నుంచి ఫహద్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఈ మల్టీ స్టారర్ సినిమా కతపైన కూర్చుంటాడని గౌతమ్ మీనన్ సన్నిహితులు చెబుతున్నారు. పర్ఫెక్ట్ కథ సెట్ అయితే చెయ్యడానికి ఈ నలుగురు హీరోస్ సిద్దమే అని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు