ట్రైలర్ అనౌన్స్ మెంట్ పై పుష్ప టీమ్ క్లారిటీ!

Published on Nov 28, 2021 7:36 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, ఈ చిత్రం లో శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. రేపు ఉదయం 11:07 గంటలకు పుష్ప ట్రైలర్ విడుదల కి సంబంధించిన డేట్ మరియు టైమ్ ను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఈ ప్రకటన తో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :