సరైనోడు సరికొత్త రికార్డు !

సరైనోడు సరికొత్త రికార్డు !

Published on Jul 16, 2018 6:22 PM IST

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘సరైనోడు’. రెండేళ్ల క్రితం ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించి బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రం గా రికార్డు నెలకొల్పింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రలో బన్నీ, ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి ల నటన ఈచిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

ఇక ఈ చిత్ర హిందీ వెర్షన్ ను రెండు కోట్లమందికి పైగా యూట్యూబ్ లో వీక్షించారు. ఈచిత్రం భారతీయ సిని చరిత్రలో అత్యిధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ విడుదల చేసిన ఈ హిందీ వెర్షన్ కి సుమారు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మళ్ళి ఈ రికార్డు ను బన్నీ నే బ్రేక్ చేయనున్నడడం విశేషం. ఆయన నటించిన ‘దువ్వాడ జగన్నాధం’. చిత్రం కూడా 2కోట్ల వ్యూస్ కి చేరువలో ఉంది. ఈ చిత్రం త్వరలోనే సరైనోడు రికార్డును బద్దలు కొట్టనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు