ప్రసంశలతో పొంగిపోతున్న అల్లు హీరో !
Published on Dec 3, 2017 3:26 pm IST

అల్లు హీరో శిరీష్ తాజా చిత్రం ‘ఒక్క క్షణం’ యొక్క టీజర్ ఈరోజు ఉదయమే విడుదలైంది. టీజర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉండటమేగాక సినిమా కొత్త తరహా కాన్సెప్ట్ తో రూపొందుతోందని సూచిస్తోంది. అంతేగాక చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ గత చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ కూడా భారీ విజయాన్ని సాధించి ఉండటంతో ఈ సినిమాపై నమ్మకాలు పెరిగిపోతున్నాయి.

ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు, తారలు టీజర్ బాగుందని, శిరీష్ ఎంచుకున్న ఈ సినిమా అతని కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. దీంతో హీరో శిరీష్ ఆనందంతో పొంగిపోతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కాంప్లిమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శీరత్ కపూర్, సురభిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook