అల్లు వారబ్బాయివి వచ్చే ఏడాది రెండు సినిమాలట..!

Published on Nov 18, 2019 9:00 pm IST

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలలో అల్లు శిరీష్ కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి. ఈ హీరో ఇంత వరకు ప్రేక్షకులు గుర్తించే మంచి చిత్రం చేయలేదు. ఆరంగేట్రమే గౌరవం అనే బై లింగ్వల్ మూవీ చేసిన శిరీష్ ఆ తరువాత ఐదు చిత్రాలు చేశారు. వాటిలో మోహన్ లాల్ తో కలిసి 1971 బియాండ్ బోర్డర్స్ అనే మూవీ చేయడం జరిగింది. ఇక ఈ ఏడాది ‘ఏబిసిడి’ పేరుతో కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేశారు. మలయాళం చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈచిత్రం కూడా శిరీష్ ని హిట్టు మెట్టు ఎక్కించలేకపోయింది.

కాగా వచ్చే ఏడాది ఈ యంగ్ హీరో ఏకంగా రెండు చిత్రాలలో నటించనున్నారట. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. 2020లో నేను రెండు చిత్రాలలో నటించనున్నాను, వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాను అని శిరీష్ తెలిపారు. మరి 2020లోనైనా శిరీష్ ఓ హిట్ అందుకొని టాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More