
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరియు అల్లు రామలింగయ్య మనవళ్లు, అల్లు అరవింద్ తనయులు అయిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు హీరోలుగా పరిచయం అయ్యారు. చాలా కాలం క్రితం వచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. 2013లో గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్ మొదటి సినిమాతో విమర్శకులను మెప్పించి, రెండవ సినిమా కొత్త జంటతో కమర్షియల్ గా విజయాన్ని అందుకున్నాడు. రెండవ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ప్రస్తుతం తన మూడవ సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి సిద్దమవుతున్నాడు.
యువత, సోలో, ఆంజనేయులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పరశురాం అల్లు శిరీష్ మూడవ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఒక వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటుంటే మరోవైపు అల్లు శిరీష్ తన మూడవ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ జిమ్ లో ఎక్కువ సేపు గడుపుతూ సిక్స్ ప్యాక్ లుక్ ని ట్రై చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ – పరశురాం మూవీ జూన్ లో అధికారికంగా ప్రారంభం కానుంది. అదే నెలలోనే సెట్స్ పైకి కూడా వెళ్లనుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ కి జోడీగా ‘సూర్య vs సూర్య’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన త్రిదా చౌదరి నటించనుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది.

