ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన స్నేహా రెడ్డి !

Published on Jul 12, 2020 11:46 am IST

హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటారు. తాజా స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో అయాన్, అర్హ ఫోటోను పోస్ట్ చేశారు. బన్నీ ఫ్యాన్స్ ను ఈ ఫోటో బాగా ఆకట్టుకుంటుంది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా, అయాన్ మరియు అర్హా ఇద్దరూ రంగురంగుల పసుపు మరియు ఆకుపచ్చ రెయిన్ కోట్లు వేసుకుని నవ్వుతూ కనిపించడం, వారు తమ ఇంటి వద్ద పచ్చని పచ్చికలో నిలబడి ఫోటోకి పోజులివ్వడం చాలా సరదాగా అనిపిస్తోంది. ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :

More