“సర్కారు వారి పాట”పై పక్కా లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Oct 20, 2020 8:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న మరో పక్కా మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో మొట్ట మొదటిసారిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ తో స్క్రీన్ పంచుకోనుంది అని ఇటీవలే ఖరారు చేసేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక పక్కా సమాచారం వినిపిస్తుంది.

ఈ చిత్రం తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతిమ దశలో ఉందని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం మొట్ట మొదటి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ యూఎస్ లో ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి అవి వచ్చినట్టయితే ఆ తక్కువ మందితోనే అక్కడికి వెళ్లి షూట్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.

మొత్తానికి మాత్రం సర్కారు వారి పాట టీం కు వీసా ఒక్కటి రావడమే తరువాయి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ మరియు మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బహుశా పాన్ ఇండియన్ ఫ్లిక్ గా కూడా ప్లాన్ చేయనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More