నాకు రెండో పెళ్ళికాలేదు..ఆ ఫొటోలు?-అమలాపాల్

Published on Mar 24, 2020 12:21 pm IST

నటి అమలాపాల్ పెళ్ళి ఫొటోలు కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె సింగర్ భవీందర్ సింగ్ ని పెళ్లాడారని వరుస కథనాలు ప్రసారం కావడం జరిగింది. ఐతే ఈ విషయంపై మొదటి సారి నటి అమలాపాల్ నోరు విప్పారు. అందరి అనుమానాలకు సమాధానంగా అది కేవలం ఓ ఫోటో షూట్ కోసం దిగిన ఫోటోలు, నాకు రెండో పెళ్లి కాలేదని వివరణ ఇచ్చారు.

భవీందర్ సింగ్ తో ఆమె దిగిన పెళ్లి ఫోటోలలో లిప్ లాక్ ఫోటోలు కూడా ఉన్నాయి. దీనితో అమలా పాల్ రెండో పెళ్లి చేసుకున్నారని అందరూ భావించారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని నటి అమలాపాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ళకు వాళ్లిద్దరూ విడిపోవడం జరిగింది. గత ఏడాది అమలాపాల్ ఆమె చిత్రంలో బోల్డ్ రోల్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More