‘యు ఎస్’ కు వెళ్లనున్న’అమర్ అక్బర్ ఆంటోనీ’ టీం !

‘యు ఎస్’ కు వెళ్లనున్న’అమర్ అక్బర్ ఆంటోనీ’ టీం !

Published on Jul 14, 2018 3:00 AM IST

Raviteja srinu vaitla

‘నీకోసం , వెంకీ , దుబాయ్ శీను’ చిత్రాల తరువాత మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ యు ఎస్ వెళ్లనుంది. ఈ చిత్రంతో ఇలియానా మళ్ళి తెలుగులోకి పునరాగమనం చేస్తుంది .

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునిల్ కమెడియన్ గా నటిస్తున్నారు.వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు