​‘అమీర్ లోగ్’ చిత్రం నుండి ‘సీదా హెలికాప్టర్ షాట్’ పాట విడుదల

​‘అమీర్ లోగ్’ చిత్రం నుండి ‘సీదా హెలికాప్టర్ షాట్’ పాట విడుదల

Published on Jul 18, 2026 8:00 AM IST

​’అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రమణ రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమీర్ లోగ్’. మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి “సీదా హెలికాప్టర్ షాట్” అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ గీతం ప్రధాన పాత్రల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని, యువత ఆశయాలను ప్రతిబింబించేలా సాగుతోంది.

​ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట ప్రధాన పాత్రలు పోషించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన ఈ తాజా పాటను ఎమ్‌సీ హరి స్వయంగా రచించి ఆలపించారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎస్‌వీకే సినిమాటోగ్రఫీ అందించగా, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

​మరోవైపు, రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆదరణ లభించగా, ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులన్నీ ముగించుకుని త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు