అమితాబ్ అందుకే అంత డిమాండ్ చేశారట !

Published on Dec 5, 2020 7:40 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు అమితాబ్ ఏకంగా 22 కోట్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి అమితాబ్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుందట. డేట్స్ ఎక్కువ కేటాయించాలి కాబట్టి.. అంత రెమ్యునరేషన్ ను అమితాబ్ డిమాండ్ చేశారట.

అయితే ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా” సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషించినా.. ఆ సినిమాలో ఆయన అసలు పారితోషికమే తీసుకోలేదు. కానీ ప్రభాస్ సినిమాకి మాత్రం 22 కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు. ఇక బాలీవుడ్ లో మార్కెట్ కోసం హీరోయిన్ గా దీపికా పదుకోన్ పెట్టుకున్నారు. ఆమెకు కూడా భారీగానే ముట్టజెబుతున్నారు. పైగా సినిమాకి దీపికా పాత్ర చాలా ఇంపార్టెంట్ అట.

సంబంధిత సమాచారం :

More