ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” లో అమితాబ్ బచ్చన్ రోల్ ఇదే?

Published on Mar 23, 2022 7:32 pm IST

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే రెండు చిన్న షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తండ్రిగా, ధనిక వ్యాపారవేత్తగా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కొత్త గాసిప్. ఇది ఊహాగానాలే అయినా ఈ వార్త వైరల్‌గా మారింది.

అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొణె కనిపించనుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :