షాకింగ్ : ‘బిగ్ బీ అమితాబ్’కు కరోనా !

Published on Jul 11, 2020 11:13 pm IST

ఒక్కసారిగా సినీ పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసింది.. ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’కు కరోనా పాజిటివ్ అని రావడం. ఈ విషయానికి సంబంధించి అమితాబ్ నే స్వయంగా ట్వీట్ చేస్తూ.. ‘T 3590 – నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో తేలింది. ఆసుపత్రికి తరలించారు. అధికారులకు సమాచారం ఇస్తున్నారు. నా కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు, ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. గత 10 రోజులలో నాకు దగ్గరగా ఉన్న వారందరూ దయచేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

అమితాబ్ లాంటి దిగ్గజానికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్‌ అయిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ కోరిన విధానం నెటిజన్లను కదిలిస్తోంది.ఇక దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. అమితాబ్ కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని 123తెలుగు.కామ్ తరఫున కోరుకుంటున్నాము.

సంబంధిత సమాచారం :

More