అమితాబ్ ఫ్యామిలీ కరోనా ట్రీట్మెంట్ పై లేటెస్ట్ అప్డేట్.

Published on Jul 12, 2020 9:09 pm IST

నిన్న అమితాబ్, అభిషేక్ తమకు కరోనా సోకిందంటూ చెప్పి బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అమితాబ్ ఫ్యాన్స్ ని ఈ న్యూస్ దిగ్బ్రాంతికి గురిచేసింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే, అమితాబ్ మరియు అభిషేక్ ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాగా తాజా ట్వీట్ లో అభిషేక్ వారి ప్రస్తుత పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చారు. డాక్టర్స్ చెప్పే వరకు అమితాబ్, అభిషేక్ హాస్పిటల్ లోనే ఉండనున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, రూల్స్ పాటించాలని కోరుకున్నారు.

కాగా అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ మరియు కూతురు ఆరాధ్య ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారని సమాచారం. అమితాబ్ కుటుంబ సభ్యులలో నలుగురు కరోనా బారిన పడగా, అమితాబ్ భార్య జయా బచ్చన్ కి కరోనా సోకలేదని తేలింది. మరో వైపు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇంటిలో మరో నలుగురు సభ్యులు కరోనా బారిన పడ్డారు.

సంబంధిత సమాచారం :

More