రామానాయుడు స్టూడియోలో నందమూరి హీరో సినిమా !

Published on Nov 15, 2018 10:43 am IST


నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం `అమృత వ‌ర్షిణి`. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం గురువారం రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో నారా రోహిత్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా, మ‌రో హీరో శ్రీకాంత్ కెమెరా స్విచాన్ చేశారు.

అన‌తరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరో నంద‌మూరి తార‌క‌ర‌త్న మాట్లాడుతూ.. ‘అభిరుచి ఉన్న ద‌ర్శ‌క నిర్మాతలు కావడంతో పాటు, క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేస్తున్నాను. ఇంటెన్స్ ఉన్న స్టోరి. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అమృత వ‌ర్షిణి’. మంచి టీమ్ కుదిరారు. సినిమా పై చాలా హోప్స్ తో ఉన్నాం’ అన్నారు.

నిర్మాత నాగ‌రాజు నెక్కంటి మాట్లాడుతూ..’నిర్మాత‌గా నా తొలి సినిమా ఇది. ద‌ర్శ‌కుడు నాకు మంచి మిత్రుడు. క‌న్న‌డ‌లో ఇప్ప‌టికే నాలుగు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక మంచి క‌థ చెప్పండంతో క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో ఈ సినిమా ప్లాన్ చేశాం, జెస్సీ గిప్ట్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ నెల 20న షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం’ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ : స‌భా కుమార్‌; స‌ంగీతం : జెస్సీ గిప్ట్; ఎడిటింగ్ : శివ‌ప్ర‌సాద్ యాద‌వ్; మాట‌లు – స‌హ ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ కుమార్‌; నిర్మాత : నాగ‌రాజు నెక్కంటి; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం : శివ‌ప్ర‌భు.

సంబంధిత సమాచారం :

More