“అమృతంలో చందమామ”గా అమృతం సీరియల్

“అమృతంలో చందమామ”గా అమృతం సీరియల్

Published on Mar 12, 2013 3:20 AM IST

Amrutham-Serial
జెమిని టీవి లో ప్రసారమైన అమృతం సీరియల్ అత్యంత జనాదరణ పొందిన తెలుగు హాస్య నాటికలలో ఒకటి.గుణ్ణం గంగరాజు గారు ఈ నాటికను సృష్టించి దాదాపు ఆరు సంవత్సరాల వరకు నడిపించారు.ఈ నాటిక ఇప్పుడు సినిమా గా రుపొందించబడుతుంది.

చిత్రీకరణ కూడా ప్రారంభమైంది.ఈ చిత్రానికి “చందమామ లో అమృతం” అనే టైటిల్ ఖరారు చేసారు,దీని చిత్రీకరణ కోసం అన్నపూర్ణ ఏడు ఎకరాల స్టూడియోలో ఒక సెట్ కూడా నిర్మించారు.అమృతం లో సర్వంగా నటించిన యింటూరి వాసు,శివన్నారాయణ(అప్పాజీ)ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు.ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

అమృతం నాటిక శివాజీరాజా,నరేష్,హర్షవర్ధన్,ఝాన్సీ,గుండు హనుమంతరావు,యింటూరి వాసు మొదలైన ఎందరో నటీనటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది,కళ్యాణి మాలిక్ థీమ్ సాంగ్ ను స్వరపరిచారు.చంద్రశేఖర్ యేలేటి కొన్ని భాగాలకు దర్శకత్వం వహించారు, ఎస్.ఎస్.కాంచి కూడా ఈ నాటిక లో నటించారు.

భారతదేశంలో “youtube” ప్రాచుర్యం పొందిన తర్వాత ఈ సీరియల్ అంతర్జాలంలో అందుబాటులోకి వచ్చింది దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.ఫిబ్రవరి,2013 నాటికి ఈ నాటిక భాగాలను కోటిమంది నెటిజన్లు వీక్షించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు