RRR..సీత పోస్టర్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

RRR..సీత పోస్టర్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on Mar 16, 2021 12:00 AM IST

ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సందర్భంగా అన్ని సినీ వర్గాలు వారు కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి ఇదిలా ఉండగా ఆమె మొట్ట మొదటి సరిగా మన తెలుగులో రాజమౌళి తీస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ రోల్ కు సీత పాత్రలో ఆలియా నటిస్తుంది.

అయితే మరి ఈరోజు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. అయితే ఇది బాగా గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపిస్తుంది. రాముని చెంత పూజకు కూర్చున్న సీత మెడలో ఉన్నటువంటి లాకెట్ చూస్తే.. మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ లో కొన్నాళ్లు వెనక్కి వెళ్ళాలి. ఈ చిత్రంలోకి బిగ్గెస్ట్ క్లైమాక్స్ ను షూట్ స్టార్ట్ చేశామని చరణ్ మరియు తారక్ పాత్రలు చెయ్యి కలిపి ఉండే మాస్ పోస్టర్ ను విడుదల చేశారు.

మరి ఇందులో ఒకరి చేతికి ఈరోజు విడుదల చేసిన ఆలియా పోస్టర్ లో కనిపించిన లాకెట్ నే కనిపించింది. సో దీనిపై రాజమౌళి ఒక మంచి కనెక్షన్ నే చూపించడం ఖాయం అనిపిస్తుంది. మరి ఈ సన్నివేశాలను జక్కన్న ఎలా చెక్కారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతానికి అయితే ఆలియా లుక్ కు పాన్ ఇండియన్ లెవెల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు