టాక్..పవన్ లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.?

Published on Nov 24, 2022 6:40 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ చిత్రం “హరిహర వీరమల్లు” దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సారథ్యంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత పవన్ లైనప్ కూడా ఆసక్తిగానే ఉంది. అయితే వాటిలో కొన్ని చిత్రాలు కాస్త లేట్ కానుండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ అయితే బయటకి వచ్చింది.

పవన్ ప్రస్తుతం చేయనున్న చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ చిత్రం “భవదీయుడు భగత్ సింగ్” చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇది లేట్ అయ్యే ఛాన్స్ ఉండగా దీనికన్నా ముందే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కే ఛాన్స్ ఉందని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఎందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పవన్ సడెన్ గా ఓ కొత్త ప్రాజెక్ట్ ని కూడా ఓకే చేయనున్నారని మాత్రం తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :