మణిరత్నం చేతుల మీదగా ‘లవ్ అంటే నేనేలే’ !
Published on Oct 10, 2018 5:41 pm IST

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘లవ్ అంటే నేనేలే’ సాంగ్ ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. తమ చిత్రంలోని పాటను.. జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.
మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో ఈ పాట చిత్రీకరణ జరుపుకుంది. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని దేవన్ ఆలపించారు.

షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook