విరాజ్ జె అశ్విన్ , రిద్ది కుమార్ , రాధా బంగారులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. నూతన దర్శకుడు ప్రతాప్ తాతం శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెంబర్ 14న విడుదలకానుంది. ఫైనాథౌజెండ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ – క్లీన్ లవ్‌స్టోరీగా రానున్న ఈ చిత్రంలో మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది. సినిమా చూసినవారు అప్రిషియేట్ చేస్తున్నారు. హీరో విరాజ్, హీరోయిన్స్ రిద్దికుమార్, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్ ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. దర్శకుడు ప్రతాప్ తాతం శెట్టి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ విడుదల చేస్తుంది” అన్నారు.
విరాజ్ జె.అశ్విన్ మాట్లాడుతూ – ”హీరో కావాలనే నా కల నిజమైంది. కె.ఎల్.ఎన్.రాజుగారి నిర్మాతగా చేసిన సినిమా ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతాప్ నా క్యారెక్టర్‌ను ఫుల్ ఎనర్జీతో తీర్చిదిద్దారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు ప్రతాప్ తాతం శెట్టి మాట్లాడుతూ – ”ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. మంచి లవ్ స్టోరీ. ‘టచ్ హ్యాజ్ ఏ మెమరీ’ అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా నిర్మాత కె.ఎల్.ఎన్.రాజుగారు లేకుంటే ఈ సినిమాయే లేదు. ఆయనకి థాంక్స్. ఈ మా ప్రయతాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.


