బర్త్ డే రోజే ఆనంద్ దేవరకొండ నుంచి మూడు కొత్త ప్రాజెక్ట్స్.!

Published on Mar 15, 2021 7:16 pm IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడుగా “దొరసాని” చిత్రంతో మంచి బజ్ ను తెచ్చుకున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. తర్వాత “మిడిల్ క్లాస్ మెలొడీస్” తో మంచి కమర్షియల్ సక్సెస్ ను కూడా ఆనంద్ దేవరకొండ అందుకున్నాడు.ఇప్పుడు మరిన్ని క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు ఆనంద్ దేవరకొండ. ఇవాళ (సోమవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ తన మూడు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ మూడు కొత్త సినిమా వివరాలు చూస్తే..

మొదటగా మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా ప్రకటించారు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్ టైన్ మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ఇక ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన రెండో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

ఇక ఇంకో సినిమా ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ లో చేయబోతున్నారు. దానికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా సినిమా మాత్రం కన్ఫార్మ్. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఇలా తన బర్త్ డే సందర్భంగా ఆనంద్ నుంచి మూడు సినిమాల అప్డేట్స్ ను ఈ యువ హీరో ఇచ్చేసాడు.

సంబంధిత సమాచారం :