విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ మూవీ “దొరసాని” రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 22, 2019 5:40 pm IST

ఒక పక్క వరుస విజయాలతో విజయ్ దేవరకొండ దూసుకుపోతుంటే తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది.ఆయన నటించిన “దొరసాని” చిత్రాన్ని జులై 5 న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించింది.

హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీని కే వి ఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్నారు. 1980ల నాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే రొమాంటిక్ లవ్ స్టోరీగా “దొరసాని” మూవీ ఉండనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో కి మంచి స్పందన వచ్చింది.

ప్రశాంత్ విహారి స్వరాల అందిస్తున్న ఈ మూవీని మధుర ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానెర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More