ఛాలెంజింగ్ రోల్ లో విజయ్ దేవరకొండ తమ్ముడు

Published on Oct 9, 2019 7:16 pm IST

సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మొదటి ప్రయత్నంగా చేసిన దొరసాని మూవీ క్రిటిక్స్ ని మెప్పించినా, కాసులు కురిపించలేకపోయింది. మొదటి చిత్రంతోనే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో అరంగేట్రం చేసిన ఆనంద్ సరసన హీరోయిన్ గా స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన దొరసాని మూవీలో వీరిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి, ఐతే ట్రాజెడీ ఎండింగ్ ప్రేక్షకులకు నచ్చినట్లు లేదు.

కాగా విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంగా కొత్త దర్శకుడు దామోదర్ అట్టాడ డైరెక్షన్స్ లో చేయడానికి సిద్ధమయ్యారు, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ గా రూపొందనుందని సమాచారం. ఐతే ఈ మూవీలో ఆనంద్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారట. ఆ పాత్ర కొరకు చాలా ఎక్సయిటింగ్ ఎదురుచూస్తున్నానంటూ ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More