దొరసాని షూటింగ్ కంప్లీట్ !

దొరసాని షూటింగ్ కంప్లీట్ !

Published on May 1, 2019 7:01 PM IST

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ అనే చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ చిత్రం నేటి తో షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ చిత్రంతో జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయం కానుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని , మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టీజర్ అతి త్వరలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు