ఓల్డ్ హిట్ రీమేక్ లో ‘ఆనంద్ దేవరకొండ’ ?

Published on Nov 20, 2019 1:00 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆనంద్ దేవరకొండ’ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆనంద్ మాత్రం ప్రస్తుతం రెండవ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతని మరో చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. ఈవీవీ సత్యనారాయణ ఓల్డ్ హిట్ మూవీ ‘తాళి’ రీమేక్‌లో ఆనంద్ నటించనున్నట్లు తెలుస్తోంది. నేటి అభిరుచులకు అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట.

కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ఆనంద్ దేవరకొండకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడని, అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని ఫీల్ అవుతున్నాడట. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన పాత్రనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ విలువైన అవకాశాలని ఆనంద్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More