ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుంది – దేవరకొండ

Published on Oct 9, 2019 10:03 pm IST

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’తో నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రెండవ సినిమా చేస్తున్న ఆనంద్ మూడవ సినిమాకు కూడా సైన్ చేశాడు. కాన్సెప్ట్ బేస్డ్ కథగా ఉంటుందట.
షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని, అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీరు కూడా గతంలో దామోదర చెప్పిన స్క్రిప్ట్, నరేషన్ నచ్చే సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చామని, హీరో పాత్రలో భిన్న కోణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట.

సంబంధిత సమాచారం :

X
More