ఇంటర్వ్యూ : గురురాజ్ – అందరూ సరదాగా చూడగలిగే సినిమానే ‘ఆనందం’ !

ఇంటర్వ్యూ : గురురాజ్ – అందరూ సరదాగా చూడగలిగే సినిమానే ‘ఆనందం’ !

Published on Mar 22, 2018 2:36 PM IST


రేపు విడుదలకానున్న సినిమాల్లో డబ్బింగ్ చిత్రం ‘ఆనందం’ కూడ ఒకటి. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించారు. చిత్ర రిలీజ్ సందర్బంగా చిత్ర నిర్మాత గురురాజ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ ‘ఆనందం’ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా చాలా బాగుంటుంది. చూస్తున్నంతసేపు పక్కనున్న వాళ్ళతో కూడ మనం మాట్లాడలేం. అప్పుడే సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సినిమా మొత్తం సరదాగా ఉంటుంది.

ప్ర) మీరు ఎక్కడెక్కడ సినిమానౌ రిలీజ్ చేస్తున్నారు ?
జ) నైజాంలో నేనే సొంతగా రిలీజ్ చేస్తున్నాను. ఆంధ్రా, సీడెడ్లో వేరే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు.

ప్ర) మీరేమైనా సినిమాలు నిర్మిస్తున్నారా ?
జ) అవును. త్వరలోనే ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాను. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాను.

ప్ర) ఇంత పోటీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ?
జ) ఈ చిత్ర హక్కుల్ని కొన్నాక చాలా మంది రీమేక్ చేస్తామని అడిగారు. కానీ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉంది కాబట్టి రీమేక్ చేయకుండా సినిమాను అందిస్తున్నాం. ఇది సరైన సీజన్ కాబట్టి ఎన్ని సినిమాలున్నా ఇది మంచి సినిమా కాబట్టి రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) నిర్మాతగా మీ ప్రస్థానం గురించి చెప్పండి ?
జ) నేను నటుడ్ని అవ్వగానే హైదరాబాద్ కి వచ్చాను. కానీ పోటీ వలన కుదరక రియల్ ఎస్టేట్ కు వెళ్లి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు