భారీ మొత్తానికి అమ్ముడైన ‘ఆనందో బ్రహ్మ’ శాటిలైట్ హక్కులు !


దర్శకుడు మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం ఈ నెల 18న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మనుషులకు దెయ్యాలు భయపడటం అనే భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పైగా థియేటర్లలో హాస్యభరిత సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

యూఎస్ లో సైతం మంచి వసూళ్లు వస్తుండగా తాజాగా చిత్ర శాటిలైట్ హక్కులకు మంచి ధర పలికింది. ప్రముఖ టీవీ ఛానెల్ జీ ఈ హక్కుల్ని రూ. 3.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో సినిమా బిజినెస్ భారీ మొత్తంలో జరిగినట్టైంది. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఇతర దక్షిణాది భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.