‘పుష్ప’తో ఆమె క్రేజ్ రైజ్ అవుతుందట !

Published on Aug 1, 2021 9:20 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాక్షన్ డ్రామాలో కీలక పాత్రలో నటిస్తోన్న అనసూయ రోల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సినిమాలో అనసూయది గంజాయి అమ్ముకునే ఓ గిరిజన పాత్ర అట.

విలన్స్ లో ఒకడైన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కు గంజాయి సప్లై చేస్తూ అతని ట్రాప్ చేసే క్రమంలో అనసూయ పాత్ర చనిపోతుందని.. సినిమాలో ఆమెది ఎమోషనల్ రోల్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఈ సినిమాతో అనసూయ క్రేజ్ నేషనల్ రేంజ్ లో రైజ్ అవ్వడం ఖాయం అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. కాగా స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :