‘రంగమార్తాండ’లో అనసూయ రోల్ అదేనా ?

‘రంగమార్తాండ’లో అనసూయ రోల్ అదేనా ?

Published on Mar 31, 2020 7:02 AM IST

యాంకర్ అనసూయ బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి ‘రంగస్థలం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న అనసూయకు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించనుందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు