మన్మధుడుతోనే అనసూయకుడా…!

Published on Aug 3, 2019 1:00 am IST

జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కథనం. అనసూయ ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తుండగా దర్శకుడు రాజేష్ నాదెండ్ల క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ పై నరేంద్రారెడ్డి బత్తెపాటి,శర్మ చుక్క సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధన్ రాజ్,వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల వంటి నటులు నటిస్తుండగా ఈ నెల 9న విడుదల కానుంది.

కాగా ఇదే రోజు కింగ్ నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహించారు. దీనితో ఈ రెండు చిత్రాలు ఒకే రోజు అనగా ఆగస్టు 9న విడుదల కానున్నాయి. మన్మధుడు 2 మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, అనసూయ నటిస్తున్న “కథనం” క్రైమ్ థ్రిల్లర్.

సంబంధిత సమాచారం :