‘పుష్ప’ రెండో పార్ట్ లో కూడా ఉంటుందట !

Published on Sep 7, 2021 12:47 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాక్షన్ డ్రామాలో కీలక పాత్రలో నటిస్తోంది అనసూయ. పుష్పలో తన పాత్ర గురించి అనసూయ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన పాత్ర ఆశ్చర్య పరుస్తుందని, తన పాత్రలో నటనకు చాలా అవకాశాలు ఉన్నాయి అని, కచ్చితంగా తనకు మంచి పేరు వస్తోందని, అలాగే తానూ రెండో భాగంలో కూడా కనిపిస్తాను అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఈ సినిమాతో అనసూయ క్రేజ్ నేషనల్ రేంజ్ లో రైజ్ అవ్వడం ఖాయం అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. కాగా స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :