లేడి ఓరియెంటెడ్ థ్రిల్లర్ లో సెల్ఫీ తెచ్చిన సమస్య !

Published on Feb 27, 2020 12:14 am IST

హానీ ప్రధాన పాత్రలో యాంకర్ రవి కీ రోల్ లో రాజు శెట్టి దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 4 గా శ్రీ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు హైద్రాబాద్ లో ప్రారంభం అయింది. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టింది టీం. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ .. ఇది లేడి ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ. ఆసక్తికరమైన కథతో తెరకెక్కిస్తున్నాం. ఈ మధ్య ఎక్కడ చూసిన, ఎక్కడవీకు వెళ్లిన సెల్ఫీ, సెల్ఫీలంటూ జనాలు ఎగబడుతున్నారు. సెల్ఫీ ని పిచ్సిగా ప్రేమించే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి, తను ప్రేమించిన వ్యక్తి వలన ఎలా కిడ్నప్ కి గురైంది. ఆ తరువాత ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అన్న పాయింట్ తో ఈ కథను తెరకెక్కిస్తునాం. ఇందులో హాని మెయిన్ రోల్ పోషిస్తుంది. అలాగే హీరోగా ఓ కొత్త అబ్బాయిని పరిచయం చేస్తున్నాం. అలాగే ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా యాంకర్ రవి కీ రోల్ పోషిస్తున్నాడు. రవి నాకు ఎప్పటినుండో పరిచయం. ఆ పరిచయంతో ఆయనను ఇందులో గెస్ట్ రోల్ చేయమని అడగ్గానే ఒప్పుకున్నందుకు థాంక్స్ అన్నారు.

యాంకర్ రవి మాట్లాడుతూ .. రాజు నాకు చాలా కాలంగా తెలుసు. తాను మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. లైఫ్ లో ఏదైనా సాధించాలనే గోల్ తో ఉంటాడు. తాను దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నానని చెప్పడం. అలాగే ఇందులో కీ రోల్ నాతో చేయించడం ఆనందంగా ఉంది. ఛాలా మంచి కథ. తప్పకుండా హీరోయిన్ హాని కి దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరోయిన్ హాని మాట్లాడుతూ .. ఆసక్తికర కథతో తెరకెక్కే సినిమాలో నేను ప్రధాన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రాజ్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అయి మా టీమ్ అందరికి మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శ్రీ కృష్ణ మాట్లాడుతూ .. మా బ్యానర్ లో ఇది నాలుగో సినిమా. దర్శకుడు రాజ్ మంచి కథ చెప్పాడు. ఇంతకీ ముందు ఇదే టీమ్ తో ఓ సినిమా చేశాను. ఆ సినిమా త్వరలోనే విడుదల అవుతుంది. ఆ సినిమాకు ఈ టీమ్ చేసిన పనితనం, మంచితనం నచ్చి ఆ టీమ్ తోనే మరో సినిమా చేస్తున్నాం. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ రోజు షూటింగ్ మొదలుపెట్టాం. రెండో షెడ్యూల్ ని వచ్చే నెల మొదటి వారంలో జరిపి, ఆ తరువాత మరో షెడ్యూల్ తో సినిమా పూర్తీ చేసి త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

సంబంధిత సమాచారం :