బిగ్ బాస్ 5: హౌజ్ లోకి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన విష్ణు ప్రియ

Published on Sep 17, 2021 11:41 am IST


బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఈ ఏడాది ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ అడుగు పెడుతోంది అని సర్వత్రా టాక్ వినిపించింది. అయితే షో మొదలైన సమయానికి చూస్తే గానీ తెలీదు. విష్ణు ప్రియ హౌజ్ లోకి ఈ ఏడాది రాలేదు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో లో ఈ ఏడాది సభ్యుల మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే విష్ణు ప్రియ తాజాగా మీడియా తో జరిపిన ఇంటరాక్షన్ లో బిగ్ బాస్ షో పై ప్రస్తావించడం జరిగింది. తనకు షో పై ఆసక్తి లేదని, బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టను అంటూ స్పష్టం చేయడం జరిగింది. మరో ప్రశ్న కి జవాబు ఇవ్వడం జరిగింది. తనకు షణ్ముక్ మంచి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :