‘మాస్టర్’ మీద ఆండ్రియా కోపం.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట

Published on Feb 24, 2021 11:36 pm IST

స్టార్ హీరో సినిమా అంటే అందులో నటించడానికి ఎవరైనా ఆసక్తి చూపుతారు. అలాంటి సినిమాలు తమ కెరీర్ ఎదుగుదలకు దోహదపడతాయని ఆశపడతారు. కానీ అలా జరక్కపోతే. సినిమాలో వారి పాత్రనే డమ్మీ చేసేస్తే. ఆ నిరాశ మామూలుగా ఉండదు. మంచి పేరు రావడం తర్వాత సంగతి ఇలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తున్నారేమిటి అనే విమర్శలు కూడ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితే నటి ఆండ్రియాకు ఎదురైంది.

ఇటీవల విడుదలైన ‘మాస్టర్’ సినిమాలో ఆండ్రియా కూడ ఉంది. హీరోకు చాలా సన్నిహితంగా ఉండే పాత్ర అది. అందుకే ఆమె సైన్ చేశారు. కానీ తీరా సినిమాలో చూస్తే ఆమె పాత్రకు ఏమంత ఇంపార్టెన్స్ లేదని, ఆ పాత్రకు ఆమెనే తీసుకోనక్కర్లేదని అనిపించింది. ప్రేక్షకులే కాదు సినీ విమర్శకులు సైతం ఆమె పాత్ర మీద పెదవి విరిచారు. ప్రాపర్ స్టార్ట్, ఎండ్ అంటూ లేని ఆ పాత్రను చేయడానికి ఆండ్రియా ఎలా ఒప్పుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఆండ్రియా సైతం సినిమా చూశాక అదే గ్రహించారట. అందుకే ఆమె ఇకపై ఎంత పెద్ద సినిమా అయినా సరే పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇకపోతే ప్రస్తుతం ఆమె మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్న ‘పిశాచి 2’తో పాటు ఇంకొక రెండు సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :