తనకు కరోనా సోకలేదని ఋజువులు చూపించిన సీనియర్ స్టార్ హీరో

Published on Dec 4, 2020 10:00 pm IST

కరోనా మహమ్మారి సినీ సెలబ్రిటీలను గట్టిగానే తాకిన సంగతి తెలిసిందే. చాలామంది నటీనటులు కోవిడ్ భారిన పడ్డారు. లాక్ డౌన్ సమయంలో అమితాబ్ బచ్చన్ కుటుంబం సభ్యులు దాదాపు అందరూ కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు. లాక్ డౌన్ అనంతరం షూటింగ్లు మొదలవగా ఈ ఉధృతి మరింతగా పెరిగింది. షూటింగ్లో పాల్గొన్న కొందరు హీరో హీరోయిన్లు కరోనా బారిన పడ్డారు. దర్శకుడు రాజ్‌ మెహితా దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘జగ్ జగ్ జీయో’ సినిమా బృందంలో కూడ కరోనా కలకలం రేపింది.

వరుణ్‌ ధావన్‌, నటీ నీతూ కపూర్‌, దర్శకుడు రాజ్‌ మెహితాలకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో షూటింగ్ నిలిపివేశారు. అయితే సినిమాలో నటిస్తున్న మరొక స్టార్ నటుడు, సీనియర్ హీరో అనిల్ కపూర్ కు కూడ కరోనా సోకినట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన అనిల్ కపూర్ పుకార్లకు చెక్ పెట్టడానికి మరోసారి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో తనకు నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినట్టు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత సమాచారం :

More