సాయి కొత్తగా ట్రై చేస్తున్నాడు – అనిల్ రావిపూడి

Published on Jul 31, 2019 3:00 am IST

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంలో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ కానుంది. కాగా ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జరువుకుంది. ఈ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరయ్యారు.

కాగా ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కందీరీగకి పని చేస్తున్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నన్ను డైరెక్టర్ ను చేయాలనుకున్నారు. ఆయనంటే నాకు అభిమానం. సాయి ప్రతి సినిమాకి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అయ్యి సాయి శ్రీనివాస్ అందరి అభిమానం చూరగొంటాడు. రాబోయే సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించేలా ఉంటాయి. రాక్షసుడు టీం కి ఆల్ ద బెస్ట్ అని అన్నారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు, హవిష్ గార్లకు థాంక్స్ అని అన్నారు.

సంబంధిత సమాచారం :