మహేష్ 26 మూవీ కి ముహర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

Published on May 22, 2019 6:18 pm IST

“మహర్షి” సక్సస్ ని విదేశాలలో కుటుంబ సమేతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు ప్రిన్స్ మహేష్. మొన్నటివరకు “మహర్షి” ప్రమోషన్ కార్యాక్రమాలలో తీరికలేకుండా గడిపిన మహేష్ కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్ళినసంగతి తేలిందే. మహేష్ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి తో చేస్తున్న తరుణంలో దర్శకుడు అనిల్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చెకచెకా చేసేస్తున్నాడంట. మహేష్ ట్రిప్ నుండి వచ్చిన వెంటనే ఈ నెల 31న పూజ కార్యక్రమాలు జరిపి జూలై 26 నుండి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాడంట.

క్యూటీ రష్మిక మందనా ప్రిన్స్ మహేష్ జోడి కడుతుండగా సీనియర్ హీరోయిన్స్ విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి “సరిలేరు నీ కెవ్వరు” “రెడ్డి గారి అబ్బాయి” అనే టైటిల్స్ పరిగణలో ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ ఫామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :

More