ఆ కాంబినేషన్ పై ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’ ఆసక్తి !

ఆ కాంబినేషన్ పై ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’ ఆసక్తి !

Published on Dec 14, 2025 10:30 PM IST

NTR Anil

దర్శకుడు అనిల్‌ రావిపూడి కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో అనిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అలాంటి అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ను తీస్తున్నాడు. పైగా ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మిగిలిన స్టార్ హీరోలతో సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అనిల్ రావిపూడి వేరే హీరోల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లకు గతంలో తాను కథలు వినిపించానని, కానీ అవి వర్కౌట్‌ కాలేదు అని అనిల్ రావిపూడి చెప్పారు. అదేవిధంగా రవితేజతో ‘రాజా ది గ్రేట్‌’ సీక్వెల్‌ చేయాలనుందని కూడా అనిల్ రావిపూడి తెలిపారు. ఐతే, అదుర్స్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చేయలేదు. మరి అనిల్ రావిపూడితో కలిసి ఎన్టీఆర్ ఓ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తే బాగుంటుందని, అనిల్ మాత్రమే కామెడీలో కొత్త ఎన్టీఆర్ ను చూపించగలడు అని తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు