‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్‌ సాంగ్‌ కోసమే అతను !

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్‌ సాంగ్‌ కోసమే అతను !

Published on Jul 26, 2021 9:03 AM IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ కి సంబంధించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ కీరవాణితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చ అనంతరం అనిరుద్ పై కీరవాణి ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ సినిమా కోసం అనిరుధ్ ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తమిళ ప్రమోషన్‌ సాంగ్‌ కోసం రాజమౌళి అనిరుధ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్ నే కంపోజ్ చేశారట.

ఇక ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది. ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు