
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై, ఆ తర్వాత తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని హీరోగా మారడం అనే కాన్సెప్ట్ ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ జరుగుతోంది. అలా తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ప్రెజంట్ తమిళ్ ఫిల్మ్ ట్రెండ్ సెట్టర్ గా మారిన హీరో విజయ్ సేతుపతి. తెలుగులో పెద్ద హిట్ అయిన హర్రర్ ఫిల్మ్ ‘పిజ్జా’ సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు వారికి కూడా పరిచయమే.. ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన విజయ్ సేతుపతి – అదే పిజ్జా సినిమా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కలిసి మరో సినిమాకి శ్రీకారం చుట్టారు.
మూడేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ‘ఇరైవి’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న తెలుగమ్మాయి అంజలి కనిపించనుంది. ఈ సినిమా కోసం అంజలి చాలా వెయిట్ కూడా తగ్గనుంది. అందుకోసమే అంజలి డైటింగ్ కూడా చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు నటుడు, డైరెక్టర్ ఎస్.జె సూర్య, బాబీ సింహా, ఖాళీ వెంకట్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు చివరిగా చేసిన ‘జిగర్తాండ’ సినిమాకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం వేరే తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అంజలి జూన్ మిడిల్ నుంచి విజయ్ సేతుపతి మూవీ సెట్లో అడుగుపెట్టనుంది.

