ఆ జోనర్‌లో కొత్త సినిమా స్టార్ట్ చేసిన అంజలి.. గ్రాండ్‌గా లాంఛ్..!

ఆ జోనర్‌లో కొత్త సినిమా స్టార్ట్ చేసిన అంజలి.. గ్రాండ్‌గా లాంఛ్..!

Published on Aug 8, 2025 9:30 PM IST

Anjali

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో 9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల రూపొందిస్తున్న కొత్త మూవీ హైదరాబాద్‌లోని మూవీ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల గతంలో సుడిగాలి సుధీర్‌తో “సాఫ్ట్‌వేర్ సుధీర్”, “గాలోడు” అనే సక్సెస్‌ఫుల్ చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. అంజలితో చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఆయన కెరీర్‌లో మరో స్పెషల్ మూవీ కానుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కలర్‌ఫుల్ విజువల్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు