కూతురు ఆత్మహత్య పై స్పందించిన సీనియర్ నటి !

Published on Jul 17, 2021 4:42 pm IST

టాలీవుడ్ లో ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేశారు. ఆమె నటించిన ప్రతి పాత్రలో తన నటనతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె అన్నపూర్ణమ్మ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన కొన్ని ఇబ్బందుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. ‘నా కూతురు కీర్తిని డాక్టర్‌ లేదా ఇంజనీర్‌ చేయాలని కలలు కన్నాను. కాకపోతే తనకు చదువు ఆసక్తి లేదు. దాంతో మాకు తెలిసిన వాళ్లలో ఓ సంబంధం ఉంటే మాట్లాడి పెళ్లి చేశాను. ఒక ఏడాదికి ఆమెకు పాప కూడా పుట్టింది. కానీ ఏమైందో ఏమో.. ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్‌ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

కానీ కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ నాకు తెలియదు. మెట్టినింటి వాళ్లు ఏమైనా అన్నారా అని కూడా మా అమ్మాయి ఏనాడు నాకు చెప్పలేదు. ఒకటి మాత్రం నిజం, తను క్షణికావేశంలో అలాంటి నిర్ణయం తీసుకుంది’ అంటూ ఆమె బాధ పడుతూ చెప్పారు.

సంబంధిత సమాచారం :