సుకుమార్ మరొక శిష్యుడి ఛాయిస్ కూడ కృతి శెట్టేనట

Published on May 28, 2021 12:36 am IST

కృతి శెట్టి.. ప్రస్తుతం యువ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు మంచి ఆప్షన్ అవుతోంది. మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఆమె బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది. యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమె చేతిలో మూడు ఆఫర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి రామ్, లింగుస్వామి ప్రాజెక్ట్ కాగా రెండవది నాని ‘శ్యామ్ సింగ రాయ్’. మూడవది సుధీర్ బాబు – ఇంద్రగంటి చిత్రం. ఇవి కాకుండా చర్చల దశలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

వాటిలో ఒకటి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు చిత్రం. బుచ్చిబాబు సాన తర్వాత సుకుమార్ తన శిష్య బృందంలోని ఇంకొందరు దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు. వారిలో కార్తీక్ దండు కూడ ఒకరు. ఇందులో సాయి తేజ్ హీరో. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని అనుకుంటున్నారట. ఇప్పటికే కృతికి కథను వినిపించడం జరిగిందని, చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. కృతి శెట్టి గనుక ఈ చిత్రాన్ని ఓకే చేస్తే అన్నదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరినీ కవర్ చేసినట్టు అవుతుంది.

సంబంధిత సమాచారం :